Home  »  TV News  »  Brahmamudi : రాజ్-ఇందుల కొత్త ప్లాన్.. రేఖకు చుక్కలు చూపిస్తున్న హైఓల్టేజ్ డ్రామా!

Updated : Jul 25, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1093 లో.....నందు, ఇందు ఇద్దరు అన్న మాటలన్నీ ఐశ్వర్య గుర్తుచేసుకొని ఇన్ని రోజులు ఆ ఇందు ఒక్కతే ఎదురు తిరిగేది ఇప్పుడు ఆ నందు తోడైందని ఐశ్వర్య కోపంగా ఉంటుంది.  అప్పుడే తన దగ్గరికి లక్కీ వచ్చి మాట్లాడుతాడు. నువ్వు ఏంట్రా ఇక్కడ అని ఐశ్వర్య అడుగుతుంది.

నేను ఇక్కడే ఉంటున్నానని లక్కీ అనగానే నిన్ను ఎవరు ఇక్కడ ఉండమన్నారని అంటుంది. రేఖ పిన్ని అని లక్కీ చెప్తాడు. ఏంటి ఐశ్వర్య నువ్వు నాతో మునుపటిలాగా ఉండట్లేదు.. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో  నీకు తెలియదని లక్కీ అనగానే ఐశ్వర్య కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది. మరొకవైపు ఎందుకు రేఖ ఎవరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నావని భ్రమరాంబ, భూషణ్ ఇద్దరు రేఖని అడుగుతారు. వాడి అడ్డు తొలగించుకోవడానికి వాడు చెప్పినట్లు వింటున్నానని రేఖ కవర్ చేస్తుంది. కానీ రేఖ మొహంలో కంగారు చూసి భ్రమరాంబకు డౌట్ వచ్చి రేఖ మన దగ్గర ఏదో దాస్తుందని భూషణ్ తో భ్రమరాంబ అంటుంది. మరొకవైపు ఇందు రాజు మాట్లాడుకుంటుంటే లక్కీ వచ్చి.. నేను ఎక్కడ ఉండాలని అడుగుతాడు.

నువ్వు మదన్ గదిలో ఉండమని రాజు చెప్తాడు. దాంతో లక్కీ వెళ్లి మదన్ తో.. తమ్ముడు ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉంటానని లక్కీ చెప్పగానే వద్దని మదన్ కోప్పడతాడు. హాల్లోకి వచ్చి.. వీడు నన్ను తమ్ముడు అని పిలుస్తున్నాడు.. నా గదిలో నువ్వు ఉండమని చెప్పవా అని గొడవ చేస్తాడు. నేను చెప్పలేదని రేఖ అనగానే నేను చెప్పానని రాజు ఎంట్రీ ఇస్తాడు. పిన్ని వద్దంటే చెప్పమని రాజు ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటే రేఖకి టెన్షన్ అవుతుంది. తరువాయి భాగంలో రాజుకి ఎలా ఉంటే నచ్చుతుందో ఇందు అలా రెడీ అయి రాజు దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.